రోహన్‌ డబుల్‌ ధమాకా | rohan kumar gets double dhamaka in under-14 tennis | Sakshi
Sakshi News home page

రోహన్‌ డబుల్‌ ధమాకా

May 27 2017 10:37 AM | Updated on Sep 5 2017 12:09 PM

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (అండర్‌–14) టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ కుమార్‌ సత్తా చాటాడు.

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (అండర్‌–14) టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ కుమార్‌ సత్తా చాటాడు. మొయినాబాద్‌లోని శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన బాలుర సింగిల్స్‌ ఫైనల్లో రోహన్‌ కుమార్‌ 4–6, 6–3, 6–1తో జై అర్జున్‌పై గెలుపొందగా... బాలికల విభాగంలో అపూర్వ వేమూరి 6–3, 6–1తో మలిష్కను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు బాలుర డబుల్స్‌ ఫైనల్లో రోహన్‌ కుమార్‌– సిద్ధార్థ్‌ ద్వయం 6–3, 6–3తో వరుస సెట్లలో వరుణ్‌–కుషాల్‌ జంటపై నెగ్గి టైటిల్‌ను దక్కించుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement