చెస్ చాంపియన్ రాఘవ్ | Raghav chess championship | Sakshi
Sakshi News home page

చెస్ చాంపియన్ రాఘవ్

Nov 14 2013 11:46 PM | Updated on Sep 2 2017 12:36 AM

బాలల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన చెస్ టోర్నమెంట్‌లో వి.రాఘవ్ శ్రీవాత్సవ్ (ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్) విజేతగా నిలిచాడు.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: బాలల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన చెస్ టోర్నమెంట్‌లో వి.రాఘవ్ శ్రీవాత్సవ్ (ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్) విజేతగా నిలిచాడు. హైదరాబాద్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ పోటీల్లో ఐదో రౌండ్ అనంతరం రాఘవ్ ఐదు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

 పి.సుశీల్ రెడ్డి (కేంద్రీయ విద్యా స్కూల్, ఎన్‌ఎఫ్‌సీ నగర్) నాలుగు పాయింట్లతో రెండో స్థానాన్ని పొందాడు. ఎం.మనీష్ చౌదరి మూడో స్థానంలో నిలిచాడు. ఎం.తరుణ్, షణ్ముఖ తేజ వరుసగా నాలుగైదు స్థానాలతో సరిపెట్టుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement