ఒక బంతి.. ఐదు పరుగులు | Sakshi
Sakshi News home page

ఒక బంతి.. ఐదు పరుగులు

Published Tue, Nov 13 2018 11:38 AM

Pakistan Take 5 Runs Off 1 Ball After Comedy Of Errors From New Zealand Fielders - Sakshi

దుబాయి: పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో కివీస్ 6.5 ఓవర్లకి 35/1తో నిలిచిన దశలో వర్షం వచ్చింది. దీంతో ఆట కొనసాగే అవకాశం లేనందున అంపైర్లు మ్యాచ్‌ని రద్దు చేశారు. కాగా, మ్యాచ్‌ మధ్యలో జరిగిన ఒక ఘటన నవ్వులు పూయించింది.

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన 49 ఓవర్‌ ఐదో బంతిని పాక్ బ్యాట్స్‌మెన్ అష్రప్ స్క్వేర్‌లెగ్ దిశగా హిట్ చేశాడు. బంతి బౌండరీ లైన్‌ సమీపానికి వెళ్లడం.. అక్కడ ఎవరూ ఫీల్డర్ లేకపోవడంతో అలవోకగా అష్రఫ్‌ - ఆసిఫ్ అలీ జోడీ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ రెండు పరుగులు పూర్తి చేసి మూడో పరుగు కోసం కూడా పరుగెత్తింది.  అయితే.. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫీల్డర్.. బంతిని అందుకుని న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్‌కి అందించాడు. బంతిని అందుకున్న లాథమ్.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు రనౌట్ కోసం విసరగా.. అదికాస్తా గురి తప్పి డీప్‌ వైపుకు వెళ్లింది. దొరికిందే చాన్స్‌గా నాలుగో పరుగుని కూడా పాక్ పూర్తి చేసింది. ఆ తర్వాత  ఫీల్డర్ బంతిని అందుకుని. మళ్లీ వికెట్ కీపర్‌కి అందించగా దాన్ని అతను వదిలేశాడు. ఫలితంగా పాక్‌కు ఐదో పరుగును కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement