పాకిస్తాన్ జోరు | Pakistan strong against West Indies in day-night Test | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ జోరు

Oct 14 2016 12:04 AM | Updated on Sep 4 2017 5:05 PM

పాకిస్తాన్ జోరు

పాకిస్తాన్ జోరు

పాకిస్తాన్ తమ టెస్టు చరిత్రలో 400వ మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించింది.

దుబాయ్: పాకిస్తాన్ తమ టెస్టు చరిత్రలో 400వ మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించింది. వెస్టిండీస్‌తో ఇక్కడ గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో కడపటి వార్తలందే సరికి పాక్ 68 ఓవర్లలో వికెట్ నష్టానికి 216 పరుగులు చేసింది.

కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న అజహర్ అలీ (200 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు) డే అండ్ నైట్ టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మరో ఓపెనర్ సమీ అస్లామ్ (212 బంతుల్లో 90; 9 ఫోర్లు) సెంచరీ కోల్పోయాడు.  ఇరు జట్లకూ గులాబీ బంతితో ఇదే తొలి డే అండ్ నైట్ టెస్టు కావడం మరో విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement