పాక్ భారీ స్కోరు | Pak puts huge score for Australia | Sakshi
Sakshi News home page

పాక్ భారీ స్కోరు

Nov 1 2014 12:59 AM | Updated on Sep 2 2017 3:39 PM

పాక్ భారీ స్కోరు

పాక్ భారీ స్కోరు

అబుదాబి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. యూనిస్ ఖాన్ (349 బంతుల్లో 213; 15 ఫోర్లు; 2 సిక్సర్లు)...

అబుదాబి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. యూనిస్ ఖాన్ (349 బంతుల్లో 213; 15 ఫోర్లు; 2 సిక్సర్లు) డబుల్ సెంచరీకి తోడు మిస్బా (101) శతకం సాధించడంతో పాక్  తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 570 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెరీర్‌లో యూనిస్‌కిది ఐదో డబుల్ సెంచరీ. అలాగే 181 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటి పాక్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్ అయ్యాడు.

304/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన పాక్ ఆదిలోనే అజహర్ అలీ (109) వికెట్ కోల్పోయింది. మూడో వికెట్‌కు యూనిస్, అలీ కలిసి రికార్డు స్థాయిలో 236 పరుగులు జోడించారు. ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్ (16 బ్యాటింగ్), లియోన్ (1 బ్యాటింగ్) ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement