సెయింట్ ఫ్రాన్సిస్ ముందంజ | osmania univeristy inter college womens badminton tournment St francis in lead | Sakshi
Sakshi News home page

సెయింట్ ఫ్రాన్సిస్ ముందంజ

Sep 27 2013 11:42 PM | Updated on Sep 1 2017 11:06 PM

ఓయూ ఇంటర్ కాలేజి మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి, సెయింట్ ఆన్స్ కాలేజి జట్లు లీగ్ పోటీల్లో విజయం సాధించి ముందంజ వేశాయి.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి, సెయింట్ ఆన్స్ కాలేజి జట్లు లీగ్ పోటీల్లో విజయం సాధించి ముందంజ వేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్ పోటీల్లో గ్రూప్(ఏ) విభాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి 2-1తో వాసవి ఇంజనీరింగ్ కాలేజిపై విజయం సాధించింది. గ్రూప్(బి) విభాగంలో సెయింట్ ఆన్స్ కాలేజి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజిపై గెలిచింది.  
 
 లీగ్ ఫలితాలు
 గ్రూప్(ఏ) విభాగం: సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి 2-1తో ఏఎంఏ కాలేజిపై, ఓయూ ఇంజనీరింగ్ కాలేజి 2-1తో అరోరా కాలేజిపై, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి 2-1తో ఓయూ ఇంజనీరింగ్ కాలేజిపై గె లుపొందాయి. గ్రూప్(బి) విభాగం: సెయింట్ ఆన్స్ కాలేజి 2-1తో హుస్సేన్ ఆలమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజిపై, భద్రుకా కాలేజి 2-1తో లయోలా అకాడమీపై గెలిచాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement