టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ | newzeland won the toss elected to bat first | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

Mar 15 2016 7:06 PM | Updated on Oct 17 2018 4:43 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ - Sakshi

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

గ్రూప్- బీలోని భారత్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

నాగ్పూర్:
టీ20 ప్రపంచకప్లో భాగంగా మంగళవారం నాగ్పూర్లో జరుగుతున్న ఆరంభ మ్యాచ్ ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే ప్రారంభమైంది. గ్రూప్- బీలోని భారత్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ విజయంతో దూకుడు మీద ఉన్న టీం ఇండియా సొంతగడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ను విజయంతో ప్రారంభించాలని ఉత్సాహంగా ఉంది. మరో వైపు న్యూజిలాండ్ కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్తో భారత్ పై విజయం సాధించాలని ఊవిల్లూరుతోంది.   

పిచ్, వాతావరణం:
పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం, భారీ స్కోరు నమోదు కావచ్చని క్యురేటర్ కర్లేకర్ చెప్పారు. పేస్‌బౌలర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ  స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చు. మంచు ప్రభావం లేదు.

జట్లు (అంచనా):
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా
న్యూజిలాండ్ : విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, రాంచీ, టేలర్, ఇలియట్, సాన్‌ట్నర్, మెకల్లమ్, సోధీ, ఆడమ్ మిల్నె, కోరీ అండర్సన్.

Advertisement
 
Advertisement
Advertisement