అంతలోనే కివీస్ టపటపా.. | Mishra, Jadhav rip through New Zealand | Sakshi
Sakshi News home page

అంతలోనే కివీస్ టపటపా..

Oct 23 2016 3:49 PM | Updated on Sep 4 2017 6:06 PM

అంతలోనే కివీస్ టపటపా..

అంతలోనే కివీస్ టపటపా..

భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతుంది అనుకునేలోపే వరుసగా కీలక వికెట్లను కోల్పోయింది.

మొహాలీ:భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతుంది అనుకునేలోపే వరుసగా కీలక వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో భాగంగా 80 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన కివీస్.. మూడో వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. దాంతో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఆపై స్వల్ప విరామాల్లో మరో మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ స్కోరు 160 పరుగుల వద్ద అండర్సన్(6) వికెట్ ను కోల్పోయిన కివీస్.. మరో పరుగు వ్యవధిలో ల్యూక్ రోంచీ(1) వికెట్ ను నష్టపోయింది.

 

ఆ తరువాత క్రీజ్ లో కుదురుగా ఆడుతున్నట్లు కనిపించిన టామ్ లాధమ్(61) కూడా వెనుదిరగడంతో కివీస్ 169 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.  అంతకుముందు గప్టిల్(27), విలియమ్సన్(22), రాస్ టేలర్(44)లు పెవిలియన్ చేరారు. ఈ ఆరు వికెట్లలో్ కేదర్ జాదవ్ మూడు వికెట్లు సాధించగా,మిశ్రాకు రెండు, ఉమేశ్ కు ఒకటి దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement