క్విటోవాపై కత్తితో దాడి | Kvitova with the knife attack | Sakshi
Sakshi News home page

క్విటోవాపై కత్తితో దాడి

Dec 21 2016 12:14 AM | Updated on Sep 4 2017 11:12 PM

క్విటోవాపై కత్తితో దాడి

క్విటోవాపై కత్తితో దాడి

రెండుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి పెట్రా క్విటోవా దొంగ చేతిలో గాయానికి ...

ప్రేగ్‌ (చెక్‌ రిపబ్లిక్‌): రెండుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి పెట్రా క్విటోవా దొంగ చేతిలో గాయానికి గురైంది. ప్రొస్టెజోవ్‌ నగరంలో క్విటోవా నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో చోరీకి చేయడానికి వచ్చిన గుర్తుతెలియని దుండగుడు ఆమె ఎడమ చేతిపై దాడి చేశాడు. దొంగపై ఎదురుతిరిగిన క్రమంలో క్విటోవా గాయానికి గురైంది.

‘నేను ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యాను. గాయం తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ సంఘటన తర్వాత నేను జీవించి ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటాను. కోలుకునే క్రమంలో కొంతకాలం నన్ను ఏకాంతంగా వదిలేయాలని కోరుతున్నాను’ అని 11వ ర్యాంకర్‌ క్విటోవా తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement