జోర్డాన్‌ ఓపెన్‌ చాంప్‌ స్నేహిత్‌ | Jordan Open champ snehith | Sakshi
Sakshi News home page

జోర్డాన్‌ ఓపెన్‌ చాంప్‌ స్నేహిత్‌

Jul 28 2017 12:23 AM | Updated on Sep 5 2017 5:01 PM

జోర్డాన్‌ ఓపెన్‌ చాంప్‌ స్నేహిత్‌

జోర్డాన్‌ ఓపెన్‌ చాంప్‌ స్నేహిత్‌

అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) జూనియర్‌ సర్క్యూట్‌ జోర్డాన్‌ ఓపెన్‌ టీటీ టోర్నమెంట్‌

హైదరాబాద్‌: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) జూనియర్‌ సర్క్యూట్‌ జోర్డాన్‌ ఓపెన్‌ టీటీ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సురవజ్జుల ఫిడేల్‌ రఫీక్‌ స్నేహిత్‌ విజేతగా నిలిచాడు. జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లో గురువారం జరిగిన బాలుర సింగిల్స్‌ ఫైనల్లో స్నేహిత్‌ 4–1 (12–10, 7–11, 11–9, 11–4, 11–6)తో జీత్‌ చంద్ర (భారత్‌)పై గెలుపొందాడు. డబుల్స్‌లో భారత్‌కే చెందిన అనుక్రమ్‌ జైన్‌తో కలిసి రజతాన్ని గెలిచిన స్నేహిత్‌ ఒకరోజు వ్యవధిలోనే సింగిల్స్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.

స్నేహిత్‌ కెరీర్‌లో ఇదే తొలి అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. సెమీఫైనల్లో స్నేహిత్‌ 4–2 (11–7, 9–11, 4–11, 11–4, 12–10, 14–12)తో హు పొ సున్‌ (చైనీస్‌ తైపీ)పై, క్వార్టర్స్‌లో 4–2 (11–4, 11–8, 11–5, 3–11, 9–11, 11–4)తో వాంగ్‌ యి ఫాన్‌ (చైనీస్‌ తైపీ)పై, ప్రిక్వార్టర్స్‌లో 4–2 (13–15, 13–15, 11–9, 11–8, 11–4, 11–4)తో అబ్దెల్‌ అజీజ్‌ యూసుఫ్‌ (ఈజిప్ట్‌)పై గెలిచాడు. 

Advertisement
 
Advertisement
Advertisement