చాంపియన్‌ హైదరాబాద్‌ | hyderabad wins handball championship | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ హైదరాబాద్‌

Sep 28 2017 10:47 AM | Updated on Sep 4 2018 5:07 PM

hyderabad wins handball championship - Sakshi

హ్యాండ్‌బాల్‌ టోర్నీ
 

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ బాలికల జట్టు విజేతగా నిలిచింది. హన్మకొండలో జరిగిన ఈ టోర్నీ టైటిల్‌ పోరులో హైదరాబాద్‌ 18–7తో ఖమ్మం జట్టును చిత్తుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆరంభం నుంచి జోరును కనబరిచిన హైదరాబాద్‌ జట్టు అర్ధభాగం ముగిసేసరికి 8–4తో ఆధిక్యంలో ఉంది. తర్వాత ఇదే ఆధిక్యాన్ని కొనసాగిస్తూ మ్యాచ్‌ను గెలుచుకుంది. విజేత జట్టు తరఫున ప్రియ 7 పాయింట్లు సాధించగా, వినీష 5, నందిత 4 పాయింట్లతో రాణించారు. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ 13–8తో నిజామాబాద్‌పై, ఖమ్మం 8–7తో వరంగల్‌పై గెలుపొందింది.  

, Hyderabad

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement