అక్షర్‌ కాస్త అక్సర్‌ ఎలా అయిందంటే.. | Sakshi
Sakshi News home page

అక్షర్‌ కాస్త అక్సర్‌ ఎలా అయిందంటే..

Published Tue, Sep 26 2017 7:06 PM

 How Akshar Patel Became Axar. The Cricketer Clears The Confusion

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా యువస్పిన్నర్‌ అక్సర్‌ పటేల్‌ తన పేరు ఎలా మారిందనే విషయాన్ని వెల్లండించారు. సహచర ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లతో బెంగళూర్‌ ఫ్లైట్‌లో సరదాగా ముచ్చటించిన వీడియోని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. తన అసలు పేరు అక్షర్‌ పటేల్‌ కానీ అక్సర్‌ ఎలా అయిందానే విషయాన్ని ఈ యువస్పిన్నర్‌ సహచర ఆటగాళ్లకు తెలియజేశాడు.

‘ నేను అండర్‌-19 శిక్షణ శిబిరంలో ఉన్నప్పుడు పాస్‌పోర్ట్‌కు అప్లే చేశాను. అప్పటికి ఇంకా నాకు పాస్‌ పోర్టు లేదు. దానికి నాకు స్కూల్‌ సర్టిఫికేట్‌ అవసరమైంది. మా నాన్న మా స్కూల్‌కు వెళ్లి నా సర్టిఫికెట్‌ తీసుకొచ్చారు. ఆ సర్టిఫికేట్‌లో మా ప్రిన్సిపాల్‌ అక్షర్‌కు బదులు అక్సర్‌గా రాశారు. దీంతో నాపేరు అక్షర్‌ కాస్త అక్సర్‌గా మారింది’. అని ఈ 23 ఏళ్ల యువస్పిన్నర్‌ చెప్పుకొచ్చాడు.  ఇక మిగిలిన రెండు వన్డేలకు బీసీసీఐ అక్సర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సిరీస్‌ ప్రారంభంలో చెన్నై ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడి తొలి మూడు వన్డేలకు అక్సర్‌ దూరమయ్యాడు. ఈ గుజరాత్ ఆటగాడు 34 అంతర్జాతీయ వన్డేలు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు. 8 టీ20ల్లో 7 వికెట్లు సాధించాడు.  ఆస్ట్రేలియాతో వరుస మూడు వన్డేల్లో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌ నాలుగో వన్డేలో ప్రయోగాలు చేయనుంది. దీంతో అక్సర్‌ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.  

Advertisement
Advertisement