భారత్‌కు రెండో గెలుపు | hockey world league | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో గెలుపు

Mar 9 2015 1:23 AM | Updated on Sep 2 2017 10:31 PM

భారత్‌కు రెండో గెలుపు

భారత్‌కు రెండో గెలుపు

నిలకడగా రాణించిన భారత మహిళల జట్టు హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

మహిళల హాకీ వరల్డ్ లీగ్
 న్యూఢిల్లీ: నిలకడగా రాణించిన భారత మహిళల జట్టు హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పోలండ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో టీమిండియా 2-0 గోల్స్ తేడాతో గెలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
 
 ఆట 13వ నిమిషంలో వందన కటారియా, 26వ నిమిషంలో పూనమ్ రాణి ఒక్కో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపారు. ఈ గెలుపుతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. సోమవారం విశ్రాంతి దినం తర్వాత మంగళవారం జరిగే చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ తలపడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement