దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా ఆమ్లా | Hashim Amla appointed as South Africa Test captain | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా ఆమ్లా

Jun 3 2014 5:44 PM | Updated on Sep 2 2017 8:16 AM

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా ఆమ్లా

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా ఆమ్లా

దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ గా హషీం ఆమ్లాను నియమించారు.

జొహాన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ గా హషీం ఆమ్లాను నియమించారు. గత మార్చిలో రిటైరయిన గ్రేమ్ స్మిత్ స్థానంలో ఆమ్లాకు జట్టు పగ్గాలు అప్పగించారు. క్రికెట్ సౌతాఫ్రికా ఈ నియామకం చేపట్టింది.

కెప్టెన్సీ పదవికి గతంలో ఆమ్లా వినిపించినా బ్యాటింగ్ పైనే పూర్తిగా దృష్టి సారించాలనే ఉద్దేశంతో అతను తిరస్కరించాడు. అయితే పదేళ్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించిన స్మిత్ రిటైరయ్యాక ఆమ్లా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బ్యాటింగ్ తో పాటు జట్టును సమర్థవంతంగా నడిపించడానికి కృషి చేస్తానని 31 ఏళ్ల ఆమ్లా చెప్పాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement