బ్రాడ్ హ్యాట్రిక్ | england bowler Broad hat-trick | Sakshi
Sakshi News home page

బ్రాడ్ హ్యాట్రిక్

Jun 21 2014 1:22 AM | Updated on Sep 2 2017 9:07 AM

బ్రాడ్ హ్యాట్రిక్

బ్రాడ్ హ్యాట్రిక్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హ్యాట్రిక్‌తో చెలరేగాడు. మరో పేసర్ ప్లంకెట్ ఐదు వికెట్లతో రాణించడంతో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి రోజున మాథ్యూస్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌లో 69.5 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటయ్యింది.

శ్రీలంక 257 ఆలౌట్

లీడ్స్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హ్యాట్రిక్‌తో చెలరేగాడు. మరో పేసర్ ప్లంకెట్ ఐదు వికెట్లతో రాణించడంతో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి రోజున మాథ్యూస్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌లో 69.5 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటయ్యింది. సంగక్కర (147 బంతుల్లో 79; 13 ఫోర్లు), చండిమాల్ (55 బంతుల్లో 45; 6 ఫోర్లు) మాత్రమే రాణించారు. బ్రాడ్ తన 12వ ఓవర్ చివరి బంతికి సంగక్కర వికెట్ తీయగా...

తన మరుసటి ఓవర్ తొలి రెండు బంతులకు చండిమాల్, ఎరంగ వికెట్లను పడగొట్టాడు. అటు ప్లంకెట్ కూడా పదునైన బంతులతో రెచ్చిపోయాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 15 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో కుక్ (14 బ్యాటింగ్), రాబిన్సన్ (21 బ్యాటింగ్) ఉన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement