దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్ | devendra trophy East zone | Sakshi
Sakshi News home page

దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్

Dec 4 2014 12:20 AM | Updated on Sep 2 2017 5:34 PM

దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్

దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్

దేశవాళీ క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ జట్టు కైవసం చేసుకుంది. వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో ఈస్ట్ 24 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలిచింది.

ముంబై: దేశవాళీ క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ జట్టు కైవసం చేసుకుంది. వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో ఈస్ట్ 24 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలిచింది. 1973-74 సీజన్‌లో మొదలైన దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ జట్టు నెగ్గడం ఇది ఐదోసారి. చివరిసారి ఈస్ట్ జట్టు 2003-04 సీజన్‌లో విజేతగా నిలిచింది.
 
 ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్‌జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారీ (92 బంతుల్లో 75; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సామంత్రి (50 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్సర్), విరాట్ సింగ్ (84 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ధావల్, జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు. వెస్ట్‌జోన్ జట్టు 47.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటయింది. 37 పరుగులకే అంబటి తిరుపతి రాయుడు సహా మూడు వికెట్లు కోల్పోయిన వెస్ట్‌ను... కేదార్ జాదవ్ (91 బంతుల్లో 97; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయితే చివరి ఓవర్లలో ఈస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చేజారకుండా చూసుకున్నారు. అశోక్ దిండా నాలుగు వికెట్లు తీశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement