బెన్‌స్టోక్స్‌ పునరాగమనం | Sakshi
Sakshi News home page

బెన్‌స్టోక్స్‌ పునరాగమనం

Published Sat, Feb 24 2018 3:20 PM

Ben Stokes to return for first England New Zealand ODI - Sakshi

లండన్‌:ఓ వ్యక్తిపై దాడి కేసులో విచారణ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు జట్టుకు దూరమైన ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పునరాగమనం ఖాయమైంది. ఆదివారం నుంచి న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌కు స్టోక్స్‌ సిద్ధమయ్యాడు. దీనిలో భాగంగా హమిల్టన్‌లో జరిగే తొలి వన్డేలో స్టోక్స్‌ ఆడే విషయాన్ని ఈసీబీ మేనేజ్‌మెంట్‌ ఖరారు చేసింది. ముందుగా ప్రకటించిన ఇంగ్లండ్‌ జాబితా ప్రకారం తొలి వన్డేకు స్టోక్స్‌ను ఎంపిక చేయలేదు.

కేవలం స్వల్ప ప్రాక్టీస్‌కు మాత్రమే పరిమితమైన కారణంగా స్టోక్స్‌ను తొలి వన్డేకు ఎంపిక చేయలేదు. అయితే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సూచన మేరకు స్టోక్స్‌ను తొలి వన్డేలో ఆడించాలని నిర్ణయించారు. దాంతో ఇంగ్లండ్‌ స్క్వాడ్‌లో స్టోక్స్‌ పేరును చేర్చారు.

 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement