భారత్‌ ‘డబుల్‌’ ధమాకా | Asian Kabaddi Championship 2017: Ajay Thakur-inspired India thump | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘డబుల్‌’ ధమాకా

Nov 27 2017 1:42 AM | Updated on Nov 27 2017 1:42 AM

Asian Kabaddi Championship 2017: Ajay Thakur-inspired India thump - Sakshi

గొర్గాన్‌ (ఇరాన్‌): కబడ్డీలో తమకు తిరుగులేదని భారత పురుషుల, మహిళల జట్లు మరోసారి నిరూపించాయి. ఆదివారం ముగిసిన ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పురుషుల, మహిళల విభాగాల్లో చాంపియన్స్‌గా నిలిచాయి. పురుషుల ఫైనల్లో టీమిండియా 36–22తో పాకిస్తాన్‌ను చిత్తు చేయగా... మహిళల జట్టు ఫైనల్లో 42–20తో కొరియాను ఓడించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో విశేషంగా రాణించిన అజయ్‌ ఠాకూర్, ప్రదీప్‌ నర్వాల్‌ అదే జోరును ఆసియా టోర్నీలోనూ కొనసాగించి భారత్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement