గోల్ఫ్ దిగ్గజం పామర్ కన్నుమూత | Arnold Palmer, golfing great, dies | Sakshi
Sakshi News home page

గోల్ఫ్ దిగ్గజం పామర్ కన్నుమూత

Sep 27 2016 2:59 AM | Updated on Sep 4 2017 3:05 PM

గోల్ఫ్ దిగ్గజం పామర్ కన్నుమూత

గోల్ఫ్ దిగ్గజం పామర్ కన్నుమూత

గోల్ఫ్ దిగ్గజం ఆర్నాల్డ్ పామర్ (87) ఆదివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

వాషింగ్టన్: గోల్ఫ్ దిగ్గజం ఆర్నాల్డ్ పామర్ (87) ఆదివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ‘ఆర్నాల్డ్ గోల్ఫ్ క్రీడకు అత్యుత్తమ అంబాసిడర్. తన ఆటతీరుతో ఎంతోమందిని ఈ గేమ్ వైపు ఆకర్షితులను చేశారు. నిజానికి ఆర్నాల్డ్ వల్లే గోల్ఫ్ అభివృద్ధి చెందిందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని యూఎస్ గోల్ఫ్ సంఘం ఘనంగా నివాళి అర్పించింది. 1954లో ప్రొఫెషనల్‌గా మారిన ఆయన  2006లో రిటైర్ అయ్యారు. పామర్‌ను అభిమానులు ముద్దుగా ‘కింగ్’ అని పిలుస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement