మూడో స్థానంలో అనిందిత్‌ | anindit in third place of racing championship | Sakshi
Sakshi News home page

మూడో స్థానంలో అనిందిత్‌

Aug 6 2017 10:49 AM | Updated on Sep 17 2017 5:14 PM

మూడో స్థానంలో అనిందిత్‌

మూడో స్థానంలో అనిందిత్‌

జేకే టైర్‌ ఎఫ్‌ఎంఎస్‌సీఐ నేషనల్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ రేసర్‌ అనిందిత్‌ రెడ్డి మెరిశాడు.

సాక్షి, హైదరాబాద్‌: జేకే టైర్‌ ఎఫ్‌ఎంఎస్‌సీఐ నేషనల్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ రేసర్‌ అనిందిత్‌ రెడ్డి మెరిశాడు. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ ఈవెంట్‌ రెండో రౌండ్‌లో ఒక రేసులో విజేతగా నిలిచి ఓవరాల్‌గా యూరో జేకే–17 విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. రేస్‌–2లో నాలుగో స్థానం నుంచి ప్రారంభించిన అనందిత్‌ విజేతగా నిలిచాడు. తొలి రేసులో రికీ కాపో గెలిచాడు.

 

ఓవరాల్‌గా జేకే–17 విభాగంలో తొలిరోజు ముగిసేసరికి నయన్‌ చటర్జీ , రికీ కాపో, అనందిత్‌ రెడ్డి వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఎల్‌జీబీ ఫార్ములా 4 కేటగిరీలో చిత్తేశ్‌ (డార్క్‌డాన్‌ రేసింగ్‌), రోహిత్‌ ఖన్నా (డార్క్‌ డాన్‌ రేసింగ్‌), రఘుల్‌ రంగసామి (ఎంస్పోర్ట్‌)... సుజుకి గిజ్జర్‌ కప్‌ విభాగంలో జోసెఫ్‌ (చెన్నై), సంజీవ్‌ (ముంబై), లల్మావిపువియా (ఐజ్వాల్‌)... రెడ్‌బుల్‌ రికీ కప్‌లో జాడెన్‌ గుణవర్దెనా, లాల్‌హురియజెలా, లాల్‌నన్సంగ వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement