అమిర్ విజృంభణ: కష్టాల్లో భారత్ | amir takes 3 wickets | Sakshi
Sakshi News home page

అమిర్ విజృంభణ: కష్టాల్లో భారత్

Jun 18 2017 8:03 PM | Updated on Sep 5 2017 1:56 PM

అమిర్ విజృంభణ: కష్టాల్లో భారత్

అమిర్ విజృంభణ: కష్టాల్లో భారత్

చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న టైటిల్ పోరులో భారత్ ఎదురీదుతోంది.

లండన్:చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న టైటిల్ పోరులో భారత్ ఎదురీదుతోంది. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఆదిలోనే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.  రోహిత్ శర్మ డకౌట్ గా పెవిలియన్ చేరగా, విరాట్ కోహ్లి(5), శిఖర్ ధావన్(21)లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరి నిరాశపరిచారు.

 

ఈ మూడు వికెట్లు పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అమిర్ ఖాతాలో చేరాయి. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన దగ్గర్నుంచీ నిప్పులు చెరిగే బంతులతో అమిర్ చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ఐదు ఓవర్లలో ఒక మెయిడిన్ సాయంతో మూడు వికెట్లు సాధించాడు. భారత్ జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement