కోలుకున్న నటి జయంతి | Veteran Kannada actress Jayanthi discharged from hospital | Sakshi
Sakshi News home page

కోలుకున్న నటి జయంతి

Apr 7 2018 7:25 AM | Updated on Apr 7 2018 7:25 AM

Veteran Kannada actress Jayanthi discharged from hospital - Sakshi

సీనియర్‌ నటి జయంతి

సాక్షి, బెంగళూరు: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బహుభాష సీనియర్‌ నటి జయంతి శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం జయంతికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆమె పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గతనెలలో శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతూ నటి జయంతి నగరంలోని విక్రమ్‌ ఆస్పత్రిలో చేరారు. ఆమె పరిస్థితి కాస్తా సీరియస్‌గా ఉండడంతో ఐసీయూలో ఉంచి వైద్యులు జయంతికి చికిత్సలు అందించారు. 12 రోజులుగా ఆమె విక్రమ్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్యుల చికిత్సకు జయంతి బాగా స్పందించి త్వరగా కోలుకున్నారు. దీంతో ఆమెను విక్రమ్‌ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం డిశ్చార్జి చేశారు.

ఈ  సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, విక్రమ్‌ ఆస్పత్రి వైద్యులు తనను చాలా చక్కగా చూసుకున్నారని చెప్పారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యంపై ఇతర భాషల్లో ఏవేవో అబద్ధ వార్తలు ప్రచురించారని, ప్రసారం చేశారని.. కానీ కన్నడ మీడియా మాత్రం సంయమనంతో పాటు జవాబుదారిగా వ్యవహరించి ఎలాంటి అవాస్తవాలను ప్రచారం, ప్రసారం చేయలేదని పేర్కొన్నారు. కన్నడ మీడియాకు తన ధన్యవాదాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement