56వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

56వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published Sun, Jan 7 2018 7:31 PM

ys jagan prajasankalpayatra 56 day schedule released - Sakshi

సాక్షి, చిత్తూరు : ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 56వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. జిల్లాలోని పూతలపట్టు నియోజక వర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. సోమవారం ఉదయం కొండారెడ్డిపల్లి క్రాస్‌ మీదుగా తలుపులపల్లి గ్రామం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. తిమ్మిరెడ్డిపల్లి , తోటలోపు, మీదుగా వైఎస్‌ జగన్‌ టీ రంగం పేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.

విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు​పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. అనంతరం రంగంపేట క్రాస్‌ చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు పూతలపట్టు చేరుకొని బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. తదుపరి సమనత్తం మీదుగా అనంతాపురం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ జగన్‌ 55 రోజు ప్రజాసంకల్పయాత్రను మొరవపాటూరు వద్ద ముగించారు. నేడు ఆయన 14.2 కిలోమీటర్లు నడిచారు. మొత్తం మీద వైఎస్‌ జగన్‌ 766.5 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పుదిపట్లబైలు, గుండ్లగుట్టపల్లి,  దామల చెరువు, గొట్టాల క్రాస్‌, గుండ్లపల్లి, సవటపల్లి, పొలకల సంత గేట్‌, పాటూరు, చౌడేపల్లిక్రాస్‌ మీదుగా పాదయాత్ర సాగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement