ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి

Rajanna Dora Campaign on Navaratnalu in Vizianagaram - Sakshi

సాలూరు ఎమ్మెల్యే  పీడిక రాజన్నదొర  

మెంటాడ:  రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబునాయుడు పాలనను మూడుసార్లు చూశారని, వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌ జగన్‌ మోహనరెడ్డికి ఒక అవకాశం ఇచ్చి సంక్షేమ ఫలాలు అందుకోవాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రజలకు పిలుపునిచ్చారు. మెంటాడ మండలంలోని లోతుగెడ్ద, తోటవలస, కొండపర్తి, జీరికివలస, ఉయ్యాడవలస, గైరమ్మపేట, నిక్కలవలస బీసీ, ఎస్సీ కాలనీల్లో పార్టీ మండలాధ్యక్షుడు రెడ్డి సన్యాసినాయుడు ఆధ్వర్యంలో నిన్న నమ్మం బాబు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ లోతుగెడ్డ, ఆండ్ర గ్రామాల మధ్య చంపావతినదిపై బ్రిడ్జి, ఆండ్ర నుంచి లోతుగెడ్ద గ్రామం మీదుగా ఆండ్ర ప్రాజెక్టు వరకు బీటీ రోడ్డు నిర్మాణం తన హయాంలో చేపట్టినట్టు వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్, రాజశేఖరరెడ్డి పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.

ఓటమి భయంతో సీఎం చంద్రబాబునాయుడు మహిళలకు పసుపు, కుంకుమ పేరుతో చెక్కులు పంపిణీ చేశారని, పింఛన్‌ పెంచారన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉపాధి పనులు కల్పించకపోవడంతో మా గిరిజన గ్రామాల నుంచి సుమారు 1500 నుంచి 2 వేలు కుటుంబాలు వరకు వృద్ధులు, చిన్నపిల్లలను ఇళ్ల వద్ద ఉంచి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోయారని ఎమ్మెల్యే రాజన్నదొర దృష్టికి తెచ్చారు. అర్హత ఉన్నా వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళా గిరిజనులకు పింఛన్లు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేగా మీకు ఓటు వేసి మీ ద్వారా జగన్నను ఈ రాష్ట్రనికి ముఖ్యమంత్రిని చేస్తామని గిరిజనులంతా ముక్తకంఠంతో చెప్పారు. కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గం నాయుకులు ఎం.మధు, ఎస్‌.నాగమణి, చింతకాశీనాయుడు, చెల్లూరు లక్ష్మణరావు, పొరిపిరెడ్డి నారాయణమూర్తి, చొక్కాకు వెంకటస్వామినాయుడు, డి.దేముడుబాబు, బాయి అప్పారావు, సారిక ఈశ్వరరావు, దాట్ల హనుమంతురాజు, రెడ్డి అప్పలనాయుడు, కిలపర్తి మధు, సూరెడ్ది పైడిపునాయుడు, ఎం. సత్యనారాయణరెడ్డి, కనిమెరక తిరుపతి, ఎజ్జిపరపు సీతంనాయుడు, పాండ్రింకి సన్యాసిరావు, రేగిడి బొంతయ్య, మండల ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top