వారధి ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ సంబరాలు | Vaaradhi Sankranthi Celebrations In Washington | Sakshi
Sakshi News home page

వారధి ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ సంబరాలు

Feb 5 2020 10:12 PM | Updated on Feb 5 2020 10:18 PM

Vaaradhi Sankranthi Celebrations In Washington - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలోని మేరీలాండ్‌ ఎల్లికాట్‌ సిటీలో వారధి ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.కివానిస్‌ వల్లాస్‌ హాల్‌లో 400 మంది సమక్షంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలోని ప్రతి చిన్న ఘట్టాన్ని వారధి సభ్యులు అత్యంత శ్రద్ధతో నిర్వహించారు. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను ముందు తరాలకు అందచేసే విధంగా ప్రతి కార్యక్రమాన్ని తీర్చి దిద్దటం జరిగింది. మంత్రోచ్చారణతో కూడిన జ్యోతి ప్రజ్వలన, అనంతరం మన సంక్రాంతి సంప్రదాయాలతో ముగ్గుల పోటీలను నిర్వహించగా మహిళలు అంత్యంత ఉత్సాహం తో పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారధి ప్రెసిడెంట్ పుష్యమి దువ్వూరి, శ్రీధర్ కమ్మదనం, వెంకట్ గాలి, అశోక్ అన్మల్శెట్టి, మారుతి కంభంపతి, సురేష్ బొల్లి, జెరల్ సెక్రటరీ సుమా ద్రోణం, చైర్మన్ కిరణ్ కదాలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement