ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి | Sonia Gandhi Discharged | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి

Oct 28 2017 5:20 PM | Updated on Oct 22 2018 9:16 PM

Sonia Gandhi Discharged - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. ఈ విషయాన్ని సర్‌ గంగా రామ్‌ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఆమె కోలుకోవటంతో సాయంత్రం 4 గంటలకు ఆమెను ఇంటికి పంపించి వేసినట్లు  గంగారామ్‌ ఆస్పత్రి చైర్మన్‌ డా.డీఎస్‌ రానా ఓ ప్రకటనలో తెలిపారు. 

కాగా, 70 ఏళ్ల సోనియాకు కడుపు నొప్పి రాగా, ఆస‍్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. సిమ్లా నుంచి ఆమెను హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని సర్‌ గంగా రామ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా సోనియా పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పటం తెలిసిందే. ఆమెను విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement