ఐదుగురిని కనే హిందువులకు 2 లక్షలు:సేన | Shiv Sena announces award of Rs 2 lakh for Hindu families with 5 kids | Sakshi
Sakshi News home page

ఐదుగురిని కనే హిందువులకు 2 లక్షలు:సేన

Aug 30 2015 2:16 AM | Updated on Jun 4 2019 6:19 PM

హిందూ కుటుంబం అయిదుగురు పిల్లల్ని కంటే.. ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు బహుమతిగా ఇస్తామని శివసేన ఆగ్రా శాఖ శనివారం ప్రకటించింది.

ఆగ్రా: హిందూ కుటుంబం అయిదుగురు పిల్లల్ని కంటే.. ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు బహుమతిగా ఇస్తామని శివసేన ఆగ్రా శాఖ శనివారం ప్రకటించింది. హిందూ జనాభా తగ్గిపోతోందన్న గణాంకాలను దృష్టిలో ఉంచుకుని హిందూ కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనటాన్ని ప్రోత్సహించటానికి ఈ రివార్డును ప్రకటిస్తున్నట్లు శివసేన ఆగ్రా యూనిట్ చీఫ్ వీణు లావణ్య తెలిపారు. 2010 నుంచి 2015 మధ్య కాలంలో ఐదుగురు పిల్లలున్న హిందూ కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement