అత్తపై రష్యా కోడలి పోరాటం | Sakshi
Sakshi News home page

అత్తపై రష్యా కోడలి పోరాటం

Published Sun, Jul 10 2016 9:49 AM

అత్తపై రష్యా కోడలి పోరాటం

ఆగ్రా(యూపీ): ఉత్తరప్రదేశ్లో ఓ రష్యాకు చెందిన కోడలు నిరసన మొదలుపెట్టింది. తనకు న్యాయం చేయాల్సిందేనంటూ తన చంటిబిడ్డను ఒళ్లో కూర్చొని దీక్షకు పూనింది. అదెదో తెలుగు సినిమాలో యమున తన బిడ్డను ఒడిలో కూర్చొబెట్టుకుని భర్తను సాధించేవరకు చేసిన పోరాటంలాగే ఓల్గా ఎఫిమెంకోవా అనే మహిళ తన అత్తమామల ఇంటి ముందు దీక్షకు కూర్చొంది.

ఇంట్లో వద్దంటూ తన అత్తమామలు కొట్టి బయటకు గెంటేయడంతో తాను ఇంటిముందు దీక్షకు దిగానని, తనకు అదే ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇచ్చేవరకు తాను ఏమి తినబోనని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇది కుటుంబ వ్యవహారం అయినందున ఎలాంటి ఫిర్యాదు నమోదుచేసుకోలేదని చెప్పింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement