రిటైరయ్యాక అరుణాచల్‌లో: రాహుల్ | Retired Arunachal Pradesh: Rahul | Sakshi
Sakshi News home page

రిటైరయ్యాక అరుణాచల్‌లో: రాహుల్

Mar 19 2014 3:26 AM | Updated on Mar 19 2019 5:47 PM

రిటైరయ్యాక అరుణాచల్‌లో: రాహుల్ - Sakshi

రిటైరయ్యాక అరుణాచల్‌లో: రాహుల్

అరుణాచల్‌ప్రదేశ్‌లోని సహజసిద్ధమైన ప్రకృతి అందాలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మంత్రముగ్ధుడ్ని చేశాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని సహజసిద్ధమైన ప్రకృతి అందాలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మంత్రముగ్ధుడ్ని చేశాయి. ఎంతగా అంటే.. రాజకీయాల నుంచి రిటైరయ్యాక ఇక్కడే సెటిలవ్వాలన్నంత... లోయర్ సుబన్‌సిరి జిల్లాలో జరిగిన ఓ ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌గాంధీ మంగళవారం మాట్లాడుతూ..


రిటైరయ్యాక ‘అపతని పీఠభూమి’గా ప్రసిద్ధి గాంచిన హపోలీలో స్థిరపడాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇంత అందమైన ప్రదేశాన్ని దేశంలో మరెక్కడా తాను చూడలేదని, ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు కొద్దిరోజులు ఇక్కడ గడపాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలే దేశంలో లౌకిక అల్లికను నాశనం చేశాయని, విద్వేషపూరిత నేరాలను పెంచాయని రాహుల్ గాంధీ విమర్శించారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement