హక్కుల చట్టాన్ని సవరించాలి: హెచ్‌ఎల్‌ దత్తు


భువనేశ్వర్‌: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మావోలు, భద్రతా సిబ్బంది మధ్య ప్రజలు నలిగిపోతున్నారని, వారిని రక్షించలేకపోతున్నామని అందుకు వీలుగా మానవహక్కుల పరిరక్షణ చట్టం, 1993ను సవరించాలని జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్‌హెచ్చార్సీ) కోరింది. ఇక్కడ మూడు రోజుల పాటు నిర్వహించిన కమిషనర్ల శిబిరంలో ఎన్‌హెచ్చార్సీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ హెచ్‌ ఎల్‌ దత్తు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1993లో మానవహక్కుల పరిరక్షణ చట్టం వచ్చినప్పటి నుంచి అనేక మంది బాధితులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఇవ్వగలిగిందని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టానికి సవరణ అవసరమని పేర్కొన్నారు. కమిషన్‌ ఆదేశాలను పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కమిషన్‌కు ఉండాలని అన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి  మెరుగుపడుతోందని అన్నారు.

 

Back to Top