‘మోదీ జీవిత చరిత్ర’ విడుదల వాయిదా

Narendra Modi Biography Book Release Postponed In Delhi - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత చరిత్ర ‘నరేంద్ర మోదీ హార్బింగర్‌ ఆఫ్‌ ప్రాస్పరెటీ అండ్‌ అపోస్టల్‌ ఆఫ్‌ వరల్డ్‌ పీస్‌’ పుస్తకం విడుదల వాయిదా పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడినట్లు పుస్తక రచయితల్లో ఒకరైన డాక్టర్‌ అదీశ్‌ సి.అగ్రావాలా తెలిపారు. ప్రత్యేకమైన సైజు, జపనీస్‌ కాగితంపై ముద్రించిన ఈ పుస్తకాన్ని ముందుగా ఇంగ్లిషులో ముద్రించారు. ఆ తరువాత అరబిక్, డచ్, ఫ్రెంచ్‌లతోపాటు, పది భారతీయ భాషల్లోకి అనువదించినట్లు రచయిత డాక్టర్‌ అదీశ్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top