అక్రమ ఆయుధ కర్మాగారం .. ఇద్దరు అరెస్ట్‌ | illegal arms factory seized in Bengal, two held | Sakshi
Sakshi News home page

అక్రమ ఆయుధ కర్మాగారం .. ఇద్దరు అరెస్ట్‌

Jan 10 2018 4:16 PM | Updated on Aug 25 2018 5:38 PM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఆయుధ తయారీ పరిశ్రమను పోలీసు అధికారులు కనుగొన్నారు. ఉత్తర 24 పరగణాలలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఓ మామిడి తోటలో దీన్ని నిర్వహిస్తున్నారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంపై మంగళవారం  దాడి చేసి టెంట్‌ కింద కర్మాగారం నిర్వహిస్తున్న కుములియా ప్రాంతానికి చెందిన సుదామ్‌ మజుందార్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రదేశం నుంచి తొమ్మిది తుపాకులను, ఆయుధాల తయారీకి ఉపయోగించే విడి భాగాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా వీటిని స్థానికంగా తయారు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ ఆయుధాల తయారీలో ప్రమేయం ఉన్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి బరాసత్‌ జిల్లా కోర్టులో బుధవారం హాజరుపరిచినట్లు జిల్లా సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement