పార్లమెంట్ ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం | Huge fire accident infront of Parliament enclosure | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం

Mar 23 2015 2:31 AM | Updated on Sep 13 2018 5:22 PM

పార్లమెంట్ ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం - Sakshi

పార్లమెంట్ ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం

పార్లమెంట్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన భవన సమీపంలోని గేట్ నంబర్ 8 దగ్గర ఉన్న ఏసీ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. పది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారులు చెప్పారు.

అక్కడ వెల్డింగ్ పని జరుగుతోందని, నిప్పు రవ్వలు ఏసీ ప్లాంట్‌లో పడే  ప్రమాదం జరిగి ఉంటుందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ ఏకే శర్మ  చెప్పారు. పార్లమెంట్‌లో ఈ వారంలో రెండుసార్లు అగ్ని ప్రమాదం సంభవించింది. గురవారం గేట్ నంబర్ 5 దగ్గర స్వల్ప ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఆందోళన వ్యక్తం చేశారు. నివేదిక ఇవ్వాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులను ఆదే శించారు.

Advertisement
 
Advertisement
Advertisement