కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం | Fire breaks out at Burrabazaar area kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

Feb 28 2017 8:12 AM | Updated on Sep 5 2018 9:47 PM

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతాలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ బుర్రాబజార్‌లో అంటుకున్న మంటలు చూస్తుండగానే భారీగా విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో ఏడెనిమిది గంటలపాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు.

రాత్రి వేళ మార్కెట్‌ ప్రాంతంలో జనం లేకపోవడం, సహాయక బలగాలు అప్రమత్తమై చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించడంతో భారీ ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. విపత్తు నిర్వహణ బలగాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement