శ్రీలంకలో మరో పేలుడు | Explosion in Sri Lankan Town Near Colombo | Sakshi
Sakshi News home page

శ్రీలంకలో మరో పేలుడు

Apr 25 2019 12:08 PM | Updated on Apr 25 2019 12:10 PM

Explosion in Sri Lankan Town Near Colombo - Sakshi

కొలంబో:  శ్రీలంక వరుస పేలుళ్లతో అతలాకుతలమవుతోంది.  గురువారం ఉదయం మరో బాంబు పేలుడు సంభవించింది. శ్రీలంక రాజధాని కొలంబోకి  40కిలోమీటర్ల దూరంలో పుగోడా జిల్లాలో జరిగిన ఈ పేలుడు మెజిస్ట్రేట్ కోర్టుకు చెందిన ఖాళీ ప్రదేశంలో  సంభవించిన ఈ పేలుడుతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.  ఈ ఉదయం 9.30కు బాంబు పేలిందని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని శ్రీలంక పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.  గత ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 359కి పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement