హనీప్రీత్‌లా అందంగా ఉందంటూ వెంటాడి... | Bihar Police Arrest Honeypreet Look Like Girl | Sakshi
Sakshi News home page

హనీప్రీత్‌లా అందంగా ఉందంటూ వెంటాడి...

Sep 21 2017 10:22 AM | Updated on Aug 21 2018 6:22 PM

Bihar Police Arrest Honeypreet Look Like Girl - Sakshi

గుర్మీత్ దత్త పుత్రిక హనీప్రీత్ కోసం వేట కొనసాగుతున్న తరుణంలో బిహార్‌లో జరిగిన ఘటన...

సాక్షి, పట్నా: ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ ఇన్సాస్‌ కోసం రాష్ట్రాలన్నీ జల్లెడ పడుతున్నారు. నేపాల్‌ పారిపోయిందన్న వార్తల నేపథ్యంలో సరిహద్దులో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. 
ఈ నేపథ్యంలో ఆమె  బిహార్‌ లో కనిపించిందన్న వార్తతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌ వైపు వేగంగా దూసుకెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారును వెంబడించారు. సుమారు 30 కిలోమీటర్లపాటు సాగిన ఛేజింగ్ అనంతరం కారును అడ్డగించగా.. అందులో ఇద్దరిని అరెస్ట్ చేసి  ఫోర్బెస్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. అయితే చివరకు ఆమె హనీప్రీత్‌ కాదని తేలింది. 
ఇంతకీ విషయం ఏంటంటే.. ఆ కారులో ఉన్న ఓ అందమైన మహిళను చూసిన ధరానా ప్రాంత స్థానికులు హనీప్రీత్‌ అయి ఉంటుందని పోలీసులకు సమాచారం అందించారంట. దీంతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆపై తప్పు తెలుసుకుని వదిలేశారు. అయితే ఆ ఛేజ్‌ సాగినంతసేపు స్థానిక మీడియాల్లో హనీప్రీత్ అరెస్ట్ అయిందని కథనాలు ప్రసారం కావటం విశేషం. కాగా, పట్నాకు చెందిన యువతి తన కుటుంబ సభ్యుడితో కలిసి వెళ్తుండగా ఇలా పోలీసులకు చిక్కి ఇబ్బందుల పాలయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement