రాందేవ్‌ ‘బాలకృష్ణ’కు అస్వస్థత | Baba Ramdev Close Aide Acharya Bal Krishna Taken To Hospital In Rishikesh | Sakshi
Sakshi News home page

రాందేవ్‌ బాబా సన్నిహితునికి అస్వస్థత

Aug 23 2019 7:31 PM | Updated on Aug 23 2019 8:18 PM

Baba Ramdev Close Aide Acharya Bal Krishna Taken To Hospital In Rishikesh - Sakshi

డెహ్రాడూన్‌: ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబాకు అత్యంత సన్నిహితులు, పతంజలి ఆయుర్వేద సంస్థ​ చైర్మన్‌ ఆచార్య బాలకృష్ణ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. పతంజలి యోగాపీఠం సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తల తిరగడం, ఛాతిలో నొప్పి రావడంతో బాలకృష్ణను ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్‌ అత్యవసర విభాగపు వైద్యులు ఆయనకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారని సమాచారం. ఆచార్య బాలకృష్ణ నేపాల్ సంతతికి చెందిన భారతీయ బిలియనీర్.

Advertisement
 
Advertisement
Advertisement