సింగర్‌గా మారిన ఎనర్జిటిక్‌ హీరో

Young Hero Ram Pothineni Turns Singer - Sakshi

ఈ జనరేషన్‌ యంగ్ హీరోలు కేవలం నటులుగా మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. చాలా మంది హీరోలు నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తుండగా అడపాదడపా గాయకులుగా మారి సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో కూడాచేరిపోయాడు.

టాలీవుడ్ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ప్రస్తుతం హలో గురు ప్రేమ కోసమే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. త్రినాథ్‌ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రామ్‌ గాయకుడిగా మారుతున్నాడట. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే రామ్‌ ఆలపించిన పాటను రికార్డ్ కూడా చేశారు. దిల్‌ రాజు బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ సినిమాను అక్టోబర్‌ 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top