Taxiwala Movie Release Date, Confirmed | Vijay Devarakonda - Sakshi
Sakshi News home page

May 23 2018 10:34 AM | Updated on May 23 2018 1:20 PM

Vijay Devarakonda Taxiwaala Release Date - Sakshi

విజయ్‌ దేవరకొం‍డ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్‌ సరసన మాళవిక నాయర్‌, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మే 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు.

అయితే అప్పటికి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో టాక్సీవాలా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జూన్‌ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజు రిలీజ్ చేస‍్తే సుధీర్‌ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సమ్మోహనం’ సినిమాతో విజయ్‌ పోటి పడాల్సి వస్తుంది. త్వరలోనే టాక్సీవాలా రిలీజ్‌ డేట్‌ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement