ఫస్ట్‌ డే ఫన్నీ డే | Vidyut Jammwal, Shruti Haasan Start Shooting For Mahesh Manjrekar's Next | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ డే ఫన్నీ డే

Apr 21 2018 12:25 AM | Updated on Apr 21 2018 12:25 AM

Vidyut Jammwal, Shruti Haasan Start Shooting For Mahesh Manjrekar's Next - Sakshi

∙మహేశ్, శ్రుతి, జమాల్, శ్రుతీహాసన్‌

విద్యుత్‌ జమాల్, శ్రుతీహాసన్‌ జంటగా నటించిన తొలి చిత్రం ‘యారా’. ఈ సినిమా రిలీజ్‌ కాకముందే మరో సినిమాలో జోడీగా నటించేందుకు రెడీ అయ్యారు వీరిద్దరూ. అదెలా అంటే? అలా కుదిరేసిందంతే. జమాల్, శ్రుతి జంటగా తిగ్మాంషు దులియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యారా’ ఇంకా విడుదల కాలేదు. కానీ, మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో విద్యుత్‌ జమాల్, శ్రుతీహాసన్‌ జంటగా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం స్టార్ట్‌ అయ్యింది. ‘‘నా కెరీర్‌లో మరో సినిమా జర్నీ స్టార్ట్‌ అయింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. జమాల్‌తో మళ్లీ కలిసి నటించబోతున్నాను. ఫస్ట్‌ డే ఫన్నీడే’’ అని పేర్కొన్నారు శ్రుతి. గతేడాది ఆమె నటించిన  ‘బెహన్‌ హోగి తేరి’ సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించింది. ఈ సంగతి అలా ఉంచితే.. ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత తెలుగులో మరో చిత్రం ఒప్పుకోలేదు శ్రుతీహాసన్‌.

Advertisement
 
Advertisement
Advertisement