స్పెయిన్ టు తెలంగాణ వయా స్విట్జర్లాండ్! | Varun Tej's 'Mister' shooting starts in Spain | Sakshi
Sakshi News home page

స్పెయిన్ టు తెలంగాణ వయా స్విట్జర్లాండ్!

Aug 10 2016 11:39 PM | Updated on Sep 4 2017 8:43 AM

స్పెయిన్ టు తెలంగాణ వయా స్విట్జర్లాండ్!

స్పెయిన్ టు తెలంగాణ వయా స్విట్జర్లాండ్!

‘లోఫర్’ లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో రిలీజైంది. ఆ తర్వాత ఓ ఆర్నెల్లు స్టోరీ డిస్కషన్స్‌కి పరిమితమైన వరుణ్‌తేజ్ రెండు సినిమాలను

‘లోఫర్’ లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో రిలీజైంది. ఆ తర్వాత ఓ ఆర్నెల్లు స్టోరీ డిస్కషన్స్‌కి పరిమితమైన వరుణ్‌తేజ్ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకువెళ్లారు. విశ్రాంతి లేకుండా స్పెయిన్ టు తెలంగాణ వయా స్విట్జర్లాండ్ ట్రావెల్ చేశారు. వరుణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ చిత్ర షూటింగ్ జూన్‌లో మొదలైంది. స్పెయిన్‌లో ఓ నెల రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
 
  అక్కణ్ణుంచి స్విట్జర్లాండ్ వెళ్లారు. స్విస్‌లోని ఫేమస్ లేక్ ‘తున్’ వద్ద సాంగ్స్ షూటింగ్ ముగించుకుని మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. ఇలా రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారో లేదో... మళ్లీ ‘ఫిదా’ షూటింగ్‌కి హాజరవుతున్నారు వరుణ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని బాన్సువాడలో జరుగుతోంది. అమెరికా ఎన్నారై కుర్రాడు తెలంగాణలోని బాన్సువాడకి వెళతాడు. ఎందుకంటే.. అక్కడమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇదే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఫిదా’ స్టోరీలైన్. విచిత్రంగా ఈ సినిమా కథలానే వరుణ్ కూడా విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘ఫిదా’ షూటింగ్ చేస్తున్నారు. కానీ, ఎవరితోనూ ప్రేమలో పడలేదు సుమా!
 

Advertisement
 
Advertisement
Advertisement