‘ఉద్యమ సింహం’ యూట్యూబ్ లో విడుదల | Udyama Simham Releases In Youtube | Sakshi
Sakshi News home page

‘ఉద్యమ సింహం’ యూట్యూబ్ లో విడుదల

Apr 4 2019 6:12 PM | Updated on Apr 4 2019 7:37 PM

Udyama Simham Releases In Youtube - Sakshi

తెలంగాణ ఉద్యమసారధి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య  కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమసింహం’. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా  అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.  పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకం పై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రం 29న విడుదలకు అన్నీ ఏర్పాట్లు చేశారు. కానీ కొందరు ఈ సినిమా విడుదల అవ్వకుండా సమస్యలు రేపుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లని , సినిమా థియేటర్ ఓనర్స్ ని బెదిరించి సినిమాను ఎవరు విడుదల చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. అయితే నిర్మాతలు కల్వకుంట్ల నాగేశ్వర రావు ఎవరికి భయపడకుండా ఉద్యమ సింహం చిత్రాన్ని యూట్యూబ్ లో టీవీ చానెల్స్ లో ఫ్రీ గా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భం గా ఫిలించాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ "ఉద్యమ సింహం సినిమా ని ఈ నెల 29 న విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ కొందరు మా సినిమాను విడుదల కాకుండా అడ్డుపడుతున్నారు. ఈ సినిమా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య కథ తో ఉండే సినిమా. ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొని పోరాడి తెలంగాణను కేసీఆర్ సాధించాడు. ఆ తరువాత దాన్ని బంగారు తెలంగాణ గా మార్చేందుకు అయన చేస్తున్న కృషి ఏమిటన్నది ఈ సినిమాలో చాలా బాగా వచ్చింది. తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని నేను యూట్యూబ్ , టీవీ చానెల్స్ లో ఫ్రీ గా విడుదల చేస్తున్నాను. యూట్యూబ్ నిర్వాహకులు మీ సినిమాని మా ఛానల్లో పెట్టుకోవచ్చు , కాపీ రైట్స్ సమస్య లేదు. ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు" అని తెలిపారు. కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి దిలీప్ బండారి సంగీతాన్ని అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement