టైటిల్స్‌ కుదిరాయి | Title Announcement Upcoming New Movies 2020 | Sakshi
Sakshi News home page

టైటిల్స్‌ కుదిరాయి

Feb 7 2020 3:02 AM | Updated on Feb 7 2020 8:10 AM

Title Announcement Upcoming New Movies 2020 - Sakshi

చిరంజీవి, ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌

సినిమా ప్రేక్షకుడి దాకా వెళ్లాలన్నా, ప్రేక్షకుడు థియేటర్‌ దాకా రావాలన్నా ప్రచారం కీలకం. సినిమా ప్రచారంలో మొట్టమొదటి చాప్టర్‌ సినిమా టైటిల్‌. పేరు ఎంత బావుంటే, ఎంత క్యాచీగా ఉంటే సినిమాకి అంత ప్లస్సు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ సినిమాలకు టైటిల్స్‌ ఫిక్స్‌ అయ్యాయని తెలిసింది. ఆ వివరాలు...

ఆచార్య చిరంజీవి
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సామాజిక అంశాలతో కూడుకున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి ‘ఆచార్య’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారట. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌ని బట్టి గమనిస్తే చిరంజీవి ఈ సినిమాలో ఫ్రొఫెసర్‌ పాత్రలో కనిపిస్తారని ఊహించవచ్చు.

డియర్‌ ప్రభాస్‌
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ముందు ‘జాన్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ‘ఓ డియర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అలాగే ‘రాధే శ్యామ్‌’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని టాక్‌.  

వకీల్‌ సాబ్‌
హిందీ చిత్రం ‘పింక్‌’ తెలుగు రీమేక్‌ను తన రీ ఎంట్రీ కోసం ఎంచుకున్నారు పవన్‌ కల్యాణ్‌. ఇందులో లాయర్‌ పాత్రలో నటిస్తున్నారాయన. ఈ సినిమా కోసం ‘వకీల్‌ సాబ్‌’ అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేశారట. వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో  ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement