లిప్‌లాక్‌ ఫోటోను షేర్‌ చేసిన హీరో సోదరి | Tiger Shroff's sister Krishna Shroff Share Kiss Photos | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌ ఫోటోను షేర్‌ చేసిన హీరో సోదరి

Feb 28 2020 6:40 PM | Updated on Feb 28 2020 7:12 PM

Tiger Shroff's sister Krishna Shroff Share Kiss Photos - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ సోదరి కృష్ణ ష్రాఫ్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిమానులతో పంచుకుంటారు. తన కుంటుంబమంతా సినీ ఇండ్రస్టీలో సెటిల్‌ అవ్వగా.. కృష్ణ మాత్రం ఇతర వ్యాపారాల్లో రాణిస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేయడంపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 26 ఏళ్ల కృష్ణ ష్రాఫ్.. ప్రస్తుతం తన ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌తో రొమాంటిక్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలను కృష్ణ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా గతంలో కూడా ఎబాన్ హ్యామ్స్‌తో కలిసి ఉన్న రొమాంటిక్‌ చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement