ముగిసిన సినీ పెద్దల సమావేశం | TFI Meeting At Annapurna Studios | Sakshi
Sakshi News home page

Apr 21 2018 1:40 PM | Updated on Mar 22 2019 5:33 PM

TFI Meeting At Annapurna Studios - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై సినీ పెద్దలు ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశం పూర్తయ్యింది. దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై సినీ ప్రముఖులు చర్చించినట్టుగా తెలుస్తోంది. సినీరంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను మీడియాకు మాత్రం వెల్లడించలేదు. ముందుగా ఈ సమావేశానికి పవన్‌ కూడా హాజరవుతారన్న ప్రచారం జరిగినా.. భద్రతా కారణాల దృష్ట్యా హాజరు కాలేదు. అయితే అదే సమయంలో పవన్‌ న్యాయవాదులతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement