నా భార్యను తిట్టినందుకే.. : శ్రీశాంత్‌ | Sreesanth Miffed With Dipika Kakar | Sakshi
Sakshi News home page

నా భార్యను తిట్టినందుకే.. : శ్రీశాంత్‌

Feb 13 2019 12:16 PM | Updated on Feb 13 2019 12:16 PM

Sreesanth Miffed With Dipika Kakar - Sakshi

నా భార్యే నా శక్తి.. నా బలం.. నా భార్యను గౌరవించలేనివారు.. నన్ను కూడా గౌరవించలేరు.

ముంబై : హిందీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-12లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన నిషేదిత క్రికెటర్‌ శ్రీశాంత్‌.. షో ఆసాంతం వివాదాలతో సావసం చేసి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అయితే హౌస్‌లో తనకు అండగా ఉంటూ.. వివాదాల్లో మద్దతుగా నిలిచిన తోటి కంటెస్టెంట్‌, నటి దీపికా కాకర్‌ను అతను చెల్లిగా ట్రీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఈ రియాల్టీ షోలో సొంత అన్న-చెల్లెల్లా వ్యవహరించారు. ఒకరిపై ఒకరు ఈగ వాలకుండా ప్రేమ కనబర్చుకున్నారు. అయితే వీరి బంధం షో అనంతరం కూడా ఇలానే కొనసాగుతుందని ఇద్దరి అభిమానులు భావించారు. కానీ ఎక్కడ చెడిందో ఏమో కానీ.. అనూహ్యంగా వీరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీపికా కాకర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను శ్రీశాంత్‌ అన్‌ ఫాలో చేయడంతో ఈ విషయం స్పష్టమైంది. దీనిపై శ్రీశాంత్‌ వివరణ కూడా ఇచ్చాడు.

‘అవును.. నేను దీపికాను అన్‌ఫాలో చేశాను. ఎందుకంటే ఆమె నాభార్యను అన్‌ఫాలో చేసింది. నా భార్యను గౌరవించలేనివారు.. నన్ను కూడా గౌరవించలేరు. నా భార్యే నా శక్తి. నా బలం. దీపికా అభిమానులు నా భార్య, పిల్లలను అభ్యంతకరమైన భాషతో దూషిస్తున్నారు. అలా చేయవద్దని ఆమెకు నా భార్య చెప్పింది. అయినా ఈ ట్రోల్స్‌ ఆగలేదు. ఆమె కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమెపై నా అభిమానులు ట్రోల్‌ చేసినప్పుడు నేను అడ్డుకున్నాను. అయితే ఈ వ్యవహారంపై నేను ఆమెతో చర్చించలేదు.. చర్చించాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆమె నా చెల్లిలాంటిది. నేను ఆ బంధాన్ని గౌరవిస్తాను. ప్రజలకు వాస్తవం తెలియడం కోసమే నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను.’ అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీశాంత్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా అతని భార్య భువనేశ్వరి ప్రతి విషయంలో మద్దతుగా నిలిచింది. ప్రతి వివాదాన్ని సోషల్‌ మీడియా వేదికగా వివరిస్తూ క్యాంపెయిన్‌ నిర్వహించింది. ముఖ్యంగా శ్రీశాంత్‌ రన్నరప్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement