వెక్కివెక్కి ఏడ్చిన శ్రీశాంత్‌! | Sreesanth Breaks Down After Salman Khan Acknowledges His Struggles From the Past | Sakshi
Sakshi News home page

Dec 8 2018 3:04 PM | Updated on Dec 8 2018 3:17 PM

Sreesanth Breaks Down After Salman Khan Acknowledges His Struggles From the Past - Sakshi

శ్రీశాంత్‌

సల్మాన్‌ నోట ఆ మాటలు విని..

ముంబై :  హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌-12లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌కు మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్‌ లభిస్తోంది. అసలే కోపిష్టి అయిన శ్రీశాంత్‌కు ఓపిక కూడా కొంచెం తక్కువ.. ఈ తరహా ప్రవర్తనతో హౌస్‌లో అతను చేసే ప్రతిపని వివాదాస్పదం అవుతూ వస్తోంది. ఈ యాటిట్యూడ్‌తో అతనికి అభిమానులు బాగా కనెక్ట్‌ అయ్యారు. శ్రీశాంత్‌ ప్రవర్తనతో ఈ రియాల్టీషో పై కూడా మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్‌ఖాన్‌.. వీకెండ్‌ ఎపిసోడ్‌లో భాగంగా విడుదల చేసిన ప్రోమోలో శ్రీశాంత్‌ కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది.

లగ్జరీ బడ్డెట్‌ టాస్క్‌లో భాగంగా హౌస్‌మెట్స్‌ శ్రీశాంత్‌ పట్ల వ్యవహరించిన తీరుపై సల్మాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీశాంత్‌ క్రికెటర్‌గా భారత జట్టుకు ఎంతో చేశాడని, అతని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని రోహిత్‌, సురభిలపై మండిపడ్డాడు. అతనికి బిగ్‌బాస్‌లో ఎదురైన అనుభవాలను గుర్తుచేస్తూ.. అతనితో హౌస్‌మేట్స్‌ వ్యవహరించిన తీరును చూపిస్తూ.. ఓ వ్యక్తిగా వాటిని తట్టుకోవడం చాలా కష్టామని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో శ్రీశాంత్‌ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇప్పుడు ఈ టాపిక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అనేక మంది అభిమానులు శ్రీశాంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌లో గలాట : ఆసుపత్రిపాలైన శ్రీశాంత్‌!

Advertisement
 
Advertisement
Advertisement