తమ్ముడి భార్యను వేధించలేదు: నటుడు | Sakshi
Sakshi News home page

తమ్ముడి భార్యను వేధించలేదు: నటుడు

Published Wed, Oct 5 2016 4:19 PM

తమ్ముడి భార్యను వేధించలేదు: నటుడు - Sakshi

ముజఫర్నగర్: కట్నం కోసం తమ్ముడి భార్యను వేధించలేదని బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పష్టం చేశాడు. బుధవారం ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్లోని పోలీస్ స్టేషన్లో నవాజుద్దీన్ హాజరయ్యాడు. తమ్ముడి భార్యను ఎప్పుడూ వేధించలేదని, ఈ కేసులో తన ప్రమేయం లేదని సాక్ష్యాలతో లిఖితపూర్వక నివేదిక అందజేశాడు.

ఈ కేసును పరిష్కరించుకునేందుకు ఇరు పార్టీలు మహిళ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు సూచించారు. మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. తన భర్త, ఆయన సోదరులు, ఆడపడచు కట్నం కోసం వేధిస్తున్నారంటూ నవాజుద్దీన్ సోదరుడు మినాజుద్దీన్ భార్య అఫ్రీన్ గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా కేవలం పబ్లిసిటీ కోసం తమపై కేసు పెట్టిందని నవాజుద్దీన్ ఆమె ఆరోపణల్ని కొట్టిపారేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement