మూడేళ్ల ముచ్చటకు నో! | Samantha Replaced with Amala Paul In Vetrimaran’s Vada Chennai Movie | Sakshi
Sakshi News home page

మూడేళ్ల ముచ్చటకు నో!

Jul 11 2016 11:46 PM | Updated on Sep 4 2017 4:37 AM

మూడేళ్ల ముచ్చటకు నో!

మూడేళ్ల ముచ్చటకు నో!

తమిళ సినిమా ‘వడ చెన్నై’లో సమంత నటించడం లేదనేది కన్ఫర్మ్ న్యూస్. సమంత తప్పుకున్నాక అమలా పాల్‌ని కథానాయికగా...

తమిళ సినిమా ‘వడ చెన్నై’లో సమంత నటించడం లేదనేది కన్ఫర్మ్ న్యూస్. సమంత తప్పుకున్నాక అమలా పాల్‌ని కథానాయికగా తీసుకున్నారు. ఇంతకీ సమంత ఎందుకు తప్పుకున్నారు? అనే పశ్నకు పలు సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా వినిపిస్తోన్న సమాధానం ‘మ్యారేజ్’ అని. నాగచైతన్యతో సమంత పెళ్లి కుదిరిందనే వార్త వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి సమంత తప్పుకోవడానికి పెళ్లి రీజన్ కాదట. అసలు కారణం ఏంటంటే.. సమంత ఈ సినిమాకి సంతకం చేసినప్పుడు దర్శక, నిర్మాతలు ఒక్క సినిమా మాత్రమే తీయాలనుకున్నారు.

ఇప్పుడు ట్రయాలజీ ప్లాన్ చేశారట. అంటే.. ‘వడ చెన్నై’ పేరుతో మూడు సినిమాలు తీస్తారన్న మాట. అది కూడా వచ్చే రెండేళ్లలో ఈ మూడు సినిమాలు తీయాలనుకుంటున్నారట. ఈ ఏడాదితో కలుపుకుని ఈ చిత్రానికి మూడేళ్లు కేటాయించాల్సిన పరిస్థితి. ఆల్రెడీ వేరే చిత్రాలు అంగీకరించడంవల్ల ఈ ట్రయాలజీకి డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అనిపించి, సమంత తప్పుకున్నారట. అంత వరకూ ఓకే. కానీ, సమంత కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు కదా అని ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ మినహా ఈ చెన్నై సుందరి చేతిలో మరో సినిమా లేదు. పెళ్లి కోసమే సమంత కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదన్నది కొందరి ఊహ. పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య, సమంత జంటగా మల్టీప్లెక్స్ థియేటర్లకూ, ఐస్‌క్రీమ్ షాపులకూ వెళ్లిన ఫొటోలు దర్శనమిస్తున్నాయి. మరి.. ‘వడ చెన్నై’ని ఎందుకు వద్దనుకున్నారో సమంతకే ఎరుక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement