సల్మాన్ వచ్చాడు.. షారుక్ రాలేదు! | Salman, Jacqueline attend Baba Siddiqui's Iftar party | Sakshi
Sakshi News home page

సల్మాన్ వచ్చాడు.. షారుక్ రాలేదు!

Jul 6 2015 3:49 PM | Updated on Sep 3 2017 5:01 AM

సల్మాన్ వచ్చాడు.. షారుక్ రాలేదు!

సల్మాన్ వచ్చాడు.. షారుక్ రాలేదు!

సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధవన్.. వీళ్లంతా బాబా సిద్దిఖీ ఇచ్చిన ఇఫ్తార్ పార్టీలో మెరుపులు మెరిపించారు. అయితే అందరి కళ్లూ కింగ్ ఖాన్ కోసం ఎదురు చూసినా.. ఆయన మాత్రం ఈ విందుకు హాజరు కాలేదు.

సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధవన్.. వీళ్లంతా బాబా సిద్దిఖీ ఇచ్చిన ఇఫ్తార్ పార్టీలో మెరుపులు మెరిపించారు. అయితే అందరి కళ్లూ కింగ్ ఖాన్ కోసం ఎదురు చూసినా.. ఆయన మాత్రం ఈ విందుకు హాజరు కాలేదు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా షారుక్ వస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఈ పార్టీకి మాత్రం షారుక్ రాలేదు. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్ల పక్కనే కూర్చుని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా తన డిన్నర్ చేసింది.

ఈ ఇఫ్తార్ విందులో సల్మాన్ సోదరి అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ కూడా పాల్గొన్నారు. హుమా ఖురేషి, కబీర్ ఖాన్, జరైన్ ఖాన్, సంగీతా బిజ్లానీ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు టీవీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వచ్చారు. బాబా సిద్దిఖీ ఇచ్చే ఇఫ్తార్ విందులో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ గత రెండేళ్లుగా పాల్గొంటున్నారు. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా.. దీనికి మాత్రం తప్పనిసరిగా హాజరయ్యేవాళ్లు. ఈసారి మాత్రం షారుక్ డుమ్మా కొట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement